TODYAS LATEST NEWS IN TOOLYWOOD
Posted by micky in Latest news in "TOLLYWOOD"
54th National Film Awards for 2006 announced
తెలుగు చిత్రరంగానికి ఈ రోజు చాలా మంచి రోజు గా చెప్పుకోవాలి. మూడు తెలుగు చిత్రాలు 2006 సంవత్సరానికి గానూ జాతీయ అవార్డులు గెలుచుకొన్నాయి. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా కమ్లి, ఉత్తమ సామాజిక చిత్రం గా హోప్, ఉత్తమ ఏనిమేషన్ చిత్రంగా కిట్టు లు ఈ అవార్డులు గెలుచుకొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోప్ చిత్ర దర్శకుడు శ్రీ సతీష్ తన చిత్రానికి అవార్డు రావడం తనకి చాలా ఆనందం గా ఉందనీ, ముఖ్యం గా రామానాయుడు గారికి ఈ క్రెడిట్ దక్కుతుందనీ, ఆయన ఒక ఫుల్ లెంగ్త్ పాత్ర చేయడం అన్నది తన చిత్రం లో నే జరిగిందనీ, తన చిత్రం ద్వారా ఏ సందేశాన్ని అయితే తాను అందివ్వాలనుకొన్నానో అది ప్రజల లోనికి చేరేలా చేయడం లో తాను సఫలీకృత మయ్యాననీ, అలాగే తన చిత్రానికి డెఫినెట్ గా అవార్డ్ లు వస్తాయని తమ యూనిట్ అందరమూ అనుకొన్నామని దానికి తగినట్లుగానే ఇప్పుడు ఈ అవార్డు లు లభించాయనీ అన్నారు. హోప్ చిత్రం గోవా లొ జరిగిన ఇండియన్ పనోరమా లో మొదటి చిత్రం గా ప్రదర్శించబడింది. అలాగే ఒక చక్కని సందేశం తో నిర్మించబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.
SUBJEST: 54th National Film Awards Lage Raho Munnabhai Hope Satish Priyamani Ashok Patki Gautam Ghose