'''''''''Avakai Biryani is all set to release in November.'''''''''
Posted by micky in Latest news in "TOLLYWOOD"
అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై తాను దర్శకత్వం వహించకుండా తనతో పాటూ మొదటినుండీ వర్క్ చేసిన అనీష్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న చిత్రం ఆవకాయ్ బిర్యాని. గతం లో శేఖర్ చిత్రం గోదావరి లో ఒక ముఖ్య మైన క్యారెక్టర్ చేసిన కమల్ కామరాజు, బిందుమాధవి అనే కొత్త అమ్మాయి ఈ చిత్రం లో జంట గా నటిస్తున్నారు. మలయాళం లో కొన్ని చిత్రాలకు సంగీతాన్నందించిన మణికాంత్ ఖాద్రి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించిన వివరాలను ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, దర్శకుడు అనీష్ లు తెలియజేసారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ " నా ప్రమేయం కేవలం నిర్మాతగా తప్పా మరేవిధం గానూ లేని చిత్రం ఇది. అనీష్ నాకు చెపిన కధ బాగా నచ్చి ఇష్టపడి చేస్తున్న చిత్రం ఇది. ఒక సిక్స్ సీటర్ ఆటో అబ్బాయి కీ ఆవకాయ పచ్చడి అమ్ముకోనే ఒక అమ్మాయికీ మద్య ప్రేమకధ ఇది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఒక చక్కని ఫీల్ గుడ్ మూవీ ఇది. మాల్గుడీ డేస్ లో ఆయన ఎంత చక్కగా తన వూరి గురించి చెబుతాడో ఇందులో కూడా అంత హాయిగా కధ నడిచి పోతుంది. ఇది పూర్తి గా అనీష్ కైండాఫ్ ఫిల్మ్, యాక్టర్స్ తో సహా పూర్తిగా కొత్త టీమ్ తో ఈ చిత్రాన్ని చేసాం. సినిమా మొత్తం వికారాబాద్ లోనే షూట్ చేసాం. ఈ నెల పది న ఆడియోను విడుదల చేసి నవంబర్ మొదటి వారం లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకొంటున్నాం" అని అన్నారు.దర్శకుడు అనీష్ మాట్లాడుతూ తన కధ మీద తన టీమ్ మీద నమ్మకం తో శేఖర్ ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు తనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నా అనీ ఇక సినిమా విషయానికి వస్తే ఆద్యంతం ఒక చక్కని ఫీల్ తో సాగి పోయే చిత్రం అనీ, అలాగే ఈ చిత్రం మ్యూజిక్ మాత్రం పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం తనకుందని, డెఫినెట్ గా తెలుగులో మా ఆవకాయ్ బిర్యాని ఆడియో ఒక మంచి ఆడియో గా మిగిలిపోతుంది అనీ అన్నారు. ఈ చిత్రం లో ఇంకా రావు రమేష్, కామేశ్వరరావు, ప్రణీత్, దుర్గేష్, వరుణ్ తదితరులు నటిస్తున్నారు.