'''''''''Nenu Meeku Telusa on 10th October.''''''''''''
Posted by micky in Latest news in "TOLLYWOOD"
మనోజ్, రియా, స్నేహా వుల్లాల్ లు జంటగా అజయ్ శాస్త్రి దర్శకత్వం లో మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం "నేను మీకు తెలుసా". ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమయ్యింది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి ఈ నెల పదవ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర సమర్పకుడు మోహన్ బాబు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ గా ఒక చిత్రాన్ని నిర్మించేటప్పుడు తాను ఎక్కువ కష్టపడతాననీ అయితే ఈ సారి ఆ పెయిన్ ని మనోజ్ ఎక్కువ తీసుకొన్నాడనీ ఒక రకం గా ఈ చిత్రం మనోజ్ కి ఒక ఛాలెంజ్ లాంటిదనీ అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ఆడియో ని తెలుగులో మొదటిసారిగా సోనీ బి.ఎమ్.జి. వారు విడుదల చేసారనీ ఈ చిత్రం తోనే తొలి ఆడుగు వేసిన సంగీత దర్శకుడు అచ్చు మంచి పేరు తెచ్చుకొన్నాడనీ ఆయన తెలిపారు. అలాగే అజయ్ కి ఇది మొదటి సినిమానే అయినా తను మొదట చెప్పిన బడ్జెట్ లోనే చిత్రాన్ని పూర్తి చేసాడనీ అతని కి కూడా మంచి ఫ్యూచర్ వుందని కూడా ఆయన తెలిపారు. దర్శకుడు అజయ్ శాస్త్రి మాట్లాడుతూ ప్రస్తుతం నేనుమీకు తెలుసా ఆడియో ఛార్ట్ బస్టర్స్ లో నంబర్ ఒన్ పొజిషన్ లో వుందనీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా పది రోజులు టైమ్ వుండగానే సొనీ వారికి తర్డ్ రిపీట్ ఆర్డర్ వచ్చిందనీ ఇంకో విశేషం ఏంటి అంటే అచ్చు బాణీలు తెలుగు తమిళం రెండింటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయని అన్నారు. మనోజ్ మాట్లాడుతూ ఈ చిత్రం డెఫినెట్ గా విజయం సాధిస్తుందనీ సాధించాలనీ తాను కోరుకొంటున్నట్లు గా తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు ఎంగేజ్ మెంట్ ఈ నెల 19 న వుంటుందని కూడా మోహన్ బాబు తెలియజేసారు.